తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కర్కష కొడుకు, కోడలు.
జగిత్యాల జూన్ 6:
సారంగపూర్ మండలం పెంబెట్ల కొనాపూర్ గ్రామానికి చెందిన గడుప బక్కవ్వ( 81)అనే వృద్ధురాలిని తన కన్న కొడుకు లింగారెడ్డి, కోడలు లక్ష్మి ఇంట్లోంచి గెంటి వేశారని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు.
ఈ మేరకు ఆ వృద్ధ తల్లి సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ సాయంతో ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా తల్లి దండ్రుల పోషణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అనంతరం అ తల్లి సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో విలేకరులకు తన గోడు వినిపిస్తూ రోదించారు . తన కొడుకు లింగా రెడ్డి, కోడలు లక్ష్మి వికలాంగురాలి నైన తనను కొట్టి ఇంట్లోంచి గెంటి వేయగా బయటనే ఉండి అడుక్కొని తింటూ, బయటనే పడుకుంటూ పలు ఇబ్బందులు పడుతున్నానని చెప్పుకొచ్చింది.
తనను ఇంట్లోంచి కొట్టి గేంటేసిన కొడుకు, కోడలు పై తగు చర్యలు తీసుకొని, తన ఇంటిలో తనను ఉంచేలా,కొడుకు, కోడలు తన సంరక్షణ, పోషణ చూసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ,ఆర్డీ ఓ,లను కోరారు.
వృద్ధురాలి వెంట సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్,వృద్ధుల సంరక్షణ కాన్సిలియేషన్ అధికారి పి. సి. హన్మంత్ రెడ్డి,ఉపాధ్యక్షులు బొల్లం విజయ్,వెల్ముల ప్రకాష్ రావు,ఎం. డి. యాకూబ్, బాలయ్య,గౌరి శెట్టి విశ్వనాథం,తదితరులు పాల్గొన్నారు.




