# Tags
#తెలంగాణ

అశ్విని హాస్పిటల్ మేనిజింగ్ డైరెక్టర్ డా.జి.సత్యనారాయణ స్వామి మాతృమూర్తి మృతి

👁 10 Views

డాక్టర్ జి సత్యనారాయణ స్వామి మాతృమూర్తి ఆస్తమయం

ప్రముఖుల నివాళులు :

ఎల్లారెడ్డిపేట:

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ మేనిజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి మాతృమూర్తి జి.బుచ్చమ్మ అనారోగ్యంతో సోమవారం
తుదిశ్వాస విడిచారు.

ఆమెకు ఇద్దరు కుమారులు జి,సత్యనారాయణస్వామి, మనోహర్ స్వామి, ఐదుగురు కుమార్తెలు రంగనాయకమ్మ శశీ, రమ, శోభ, పద్మ ఉన్నారు,
ఆమె పార్థివదేహాన్ని వేదపండితులచే శాస్త్రోక్తంగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కుటుంబం సభ్యులచేత పూజలు నిర్వహించారు.

ఆమె పార్థివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఏఎంసి చైర్మన్ షేక్ సాభేరా బేగం , ప్రొఫెసర్ డాక్టర్ బద్ధి పడిగే శివారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి,మాజీ జెడ్పిటిసి సభ్యులు వడ్నాల నర్సయ్య, లక్ష్మణ్ రావు,ఎఏం సీ మాజీ చైర్మన్ లు అందే సుభాష్ కొండ రమేష్ గౌడ్,ఆర్ ఎంపీ పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పాతూరి ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయ్ బండారి బాల్ రెడ్డి,నంది కిషన్, మేగి నరసయ్య, గంట వెంకటేష్ గౌడ్, బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, దుంపెన రమేష్, వివిధ పార్టీ ల నాయకులు, మండలంలోని ఆర్ఎంపీలు పీఎంపీలు, జర్నలిస్ట్ లు బాలచందర్ రెడ్డి, పంజా సంపత్, శ్యామంతుల అనిల్ చెట్కూరి తిరుపతి గౌడ్, పెంటం శ్రీనివాస్ లు సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 

డాక్టర్ జి, సత్యనారాయణ స్వామి, మనోహర్ లను వారు పరమర్షించారు. అనంతరం వైకుంఠ రథంపై ఊరేగింపు గా తీసుకవెళ్ళి స్థానిక గిద్ద చెరువు ప్రక్కన గల స్మశాన వాటికలో ఆంత్యక్రియలు నిర్వహించారు.