# Tags
#తెలంగాణ

జీవో 25తో లింక్ చేయకుండా, జీవో 190ని అమలు చేయాలి: సియస్ రామకృష్ణరావు ను కోరిన తపస్ నాయకులు

👁 5 Views

జీవో 25తో లింక్ చేయకుండా 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగేలా జీవో 190ని పూర్తిగా అమలు చేయాలి.
సియస్ రామకృష్ణరావు ను కోరిన తపస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు….


317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగేలా ఇచ్చిన జీవో 190 ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వొద్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య,ఆర్గనైజింగ్ సెక్రటరీ హన్మంత్ రావులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ను కల్సి ప్రాతినిధ్యం సమర్పించారు.

జీవో 25 తో ముడిపెట్టకుండా ఆ జీవో ను ప్రత్యేకంగా అమలు చేయాలి. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు తాత్కాలిక ఉపశమనం కోసం ప్రభుత్వం చేసిన 190 జీవో ను వెంటనే అమలు పరచాలని కోరారు.స్థానికతను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం త్వరగా తీసుకోవాలి.