# Tags
#తెలంగాణ #జగిత్యాల

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా, ఆద్యంతం ఆయన ప్రసంగం ఉద్వేగభరితం..

👁 26 Views

జగిత్యాల :

ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ..

విధి లేని పరిస్థితిలో పార్టీని వీడుతున్నానని స్పష్టం చేసిన  జీవన్ రెడ్డి

జీవన్ రెడ్డి  ఎదగకుండా  అణగదొక్కాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన… ఆ పరిస్థితుల్లో పార్టీలో ఉండడం కంటే ఎదిరించి పోరాటం చేయడమే సరని నిర్ణయించుకున్నానని, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి  స్పష్టం చేశారు.

బుధవారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రం లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన నాటినుండి తనపట్ల అనుసరించిన విధానాలు, గత 20 నెలలుగా తానుపడ్డ మానసిక క్షోభ, జరుగుతున్న అవమానం, నాయకుల బుజ్జగింపు, పార్టీ కోసం 40 సంవత్సరాల తన పోరాటం  తదితర అంశాలపై ఉద్వేగంగా ప్రసంగించారు.

ఎదిరించి పోరాటం చేయడం  నాకు కొత్త కాదు….

చంద్రబాబును, కెసిఆర్ ను ఎదిరించి పోరాటం చేసిన….రేవంత్ రెడ్డిని సైతం  ఎదిరించి పోరాటం చేస్తానని కార్యకర్తల చప్పట్ల మధ్య స్పష్టం చేశారు.

ఎదిరొస్తే పోయేది ఏముంది.. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఎంతకాలం ఈ మానసిక క్షోభ అనుభవించాలన్నారు.

నీ అడుగులకు మడుగులు మడుగులు ఒత్తేవారు..కావాలి..మీకు ఎదిరించే వారు వద్దు…రాహుల్  గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేవాడిని నేను, నన్ను  అణగదొక్కుతున్నారు.ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పార్టీ నాది..అడ్డు వేస్తే తొక్కుతా అంటున్నారు. ఎంత మందిని అణగ తొక్కుతారు..అని నిలదీశారు. మమ్మల్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదనీ అన్నారు.

కార్యకర్తలను గౌరవించడం తెలుసుకో..రేవంత్ రెడ్డి పతనం ఇక్కడినుండే ఆరంభమవుతుందన్నారు.

నాలుగు దశాబ్దాలుగా అండగా నిల్చిన కార్యక్తలు నాకు తోడుగా నిలవాలని కోరుకుఅంటున్నానంటూ… ఇంకా పలు అంశాలపై ఉద్వేగంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ద్వజమెత్తారు…

పార్టీలో వేం నరేంద్ర రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ల పాత్ర ఏమిటి, వారెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

hii

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా, ఆద్యంతం ఆయన ప్రసంగం ఉద్వేగభరితం..

Arrive Alive, A Campaign for Safer Roads

Leave a comment

Your email address will not be published. Required fields are marked *