# Tags
#తెలంగాణ

16 నెలలుగా నివేదిక ఇవ్వని జిల్లా పంచాయతీ అధికారి, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

👁 5 Views

*రాష్ట్ర సమాచార కమిషనర్ ఆదేశాలు కూడా భేఖాతర్ 

కోరుట్ల / జగిత్యాల జిల్లా: 

జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి సిహెచ్ మదన్ మోహన్ గత 16 నెలలుగా నివేదిక సమర్పించకుండా జాప్యం చేస్తున్నారని పలు అనుమానాలతో ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో కోరుట్లకు చెందిన చుక్క గంగారాజం పిర్యాదు చేశారు.

2025 సెప్టెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారి భేఖాతర్ చేశారని పిర్యాదు దారుడు ఆరోపించారు. 

కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పై 2025 మార్చ్ 3న జిల్లా పంచాయతీ అధికారికి పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కోరుట్ల ఎంపివో విచారణ అనంతరం పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారన్నారు.

సంజాయిషీ స్వీకరించిన డిపివో చట్టపరమైన చర్యల కొరకు జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ, జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ఇప్పటివరకూ, జిల్లా కలెక్టర్ కు ఎలాంటి నివేదిక సమర్పించకుండా కాలయాపన చేస్తున్నారని పిర్యాదుదారుడు చుక్క గంగారాజం ఆరోపించారు. 

అనేక మార్లు పిర్యాదులు చేస్తూ ప్రత్యక్షంగా డిపివో ను కలిసినా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేస్తున్న కాలయాపన పై తనకు పలు అనుమానాలు కూడా కలుగుతున్నాయని జిల్లా కలెక్టర్ కు సోమవారం ఇచ్చిన పిర్యాదులో చుక్క గంగారాజం పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *