# Tags
#Blog

సఖి ఆధ్వర్యంలో మహిళా సాధికారత అంశంపై అవగాహన కార్యక్రమం

👁 20 Views

ధర్మపురి : (తుమ్మనాల, బుద్దేశిపల్లి)

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా. ..ధర్మపురి మండలంలోని తుమ్మనాల మరియు బుద్దేశిపల్లి గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సాధికారత అంశంపై గ్రామ పంచాయతీలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం నుండి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి కట్కూరి లావణ్య మరియు లీగల్ కౌన్సిలర్ శ్రీమతి ఆవునూరి ఊర్మిళ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి కట్కూరి లావణ్య మాట్లాడుతూ, సఖి కేంద్రాల ద్వారా మహిళలకు అందిస్తున్న తాత్కాలిక వసతి, కౌన్సెలింగ్, పోలీసు సహాయం, న్యాయ సహాయం మరియు ఇతర సహాయక సేవలు వంటి ఐదు రకాల సేవల గురించి వివరించారు.

అలాగే మహిళల సహాయార్థం అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 181 గురించి అవగాహన కల్పించారు.

అదనంగా, అవగాహన సదస్సులో భాగంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013 (POSH Act, 2013) మరియు పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించే చట్టం – 2012 (POCSO Act, 2012) గురించి వివరించి, వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మహిళా సాధికారత విభాగం నుండి శ్రీమతి స్వప్న గౌతమి కూడా హాజరయ్యారు.

Power of Hanuman Chalisa: Millions Turn to

Leave a comment

Your email address will not be published. Required fields are marked *