# Tags
#Blog

నేషనల్ ఎలిజిబిలిటీ – కమ్ -ఎంట్రెన్స్ టెస్ట్ ఏర్పాట్లపై   ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు వీడియో కాన్ఫరెన్స్ 

👁 5 Views

నేషనల్ ఎలిజిబిలిటీ – కమ్ -ఎంట్రెన్స్ టెస్ట్ పై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నుండి  ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, న్యూ డిల్లి వారు దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ – కమ్ -ఎంట్రెన్స్ టెస్ట్  ప్రవేశ పరీక్షను ఈ నెల  21వ తేది ఆదివారం రోజున మధ్యాహ్నం 02:00 గం. ల నుండి 05:15 గం. ల వరకు, వికలాంగులకు మధ్యాహ్నం 02:00 గం. ల నుండి 06:15 గం. ల వరకు నిర్వహిస్తున్నారని వివరించారు. ఇట్టి ప్రవేశ పరీక్ష జగిత్యాల జిల్లా లోని మూడు (03) పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుందని వెల్లడించారు.

నాచుపల్లి JNTUH ఇంజనీరింగ్ కళాశాలలో రెండు (02) సెంటర్లు మరియు SKNR ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, జగిత్యాల యందు ఒక (01) సెంటర్ లో పరీక్ష నిర్వహించబడుతుందని వివరించారు 

వీటిలో 807 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారనీ, ఈ  పరీక్ష కోసం  అవసరమైన ఏర్పాట్ల విషయమై అవసరమైన చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు.

ఈ  సమావేశంలో ఇంకా జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా విద్య శాఖ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, సూపరింటెండింగ్ ఇంజినీర్, TGNPDCL, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ప్రజా సంభంధాల అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, జగిత్యాల, పోస్టల్ అధికారి, జగిత్యాల మున్సిపల్ కమిషనర్, జగిత్యాల & కొడిమ్యాల తహశీల్దార్లు, NEET సిటీ కో ఆర్డినేటర్ మరియు జవహర్ నవోదయ విద్యాలయం కోరుట్ల ప్రిన్సిపాల్ గారు మరియు సంభంధిత సెంటర్ సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.

/new post

Leave a comment

Your email address will not be published. Required fields are marked *