రూ.4528.11 కోట్ల వ్యాపారం, దక్షిణ భారతదేశంలో కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో 2వ అతిపెద్ద బ్యాంకు “ది గాయత్రి కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి.”
రూ॥ 4528.11 కోట్ల వ్యాపారాన్ని సాధించి, దక్షిణ భారతదేశంలోనే కో ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో 2వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించామని బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ అన్నారు.
73వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని ది గాయత్రి కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., జగిత్యాల ప్రధాన కార్యాలయంలో బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో, సహకార శాఖ అధికారులు, బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ముఖ్య కార్యనిర్వాహణాధికారి వనమాల శ్రీనివాస్, జనరల్ మేనేజర్లు శ్రీలత, బోగ రవీంధర్, పి.టి.ఎస్. శ్రీనివాస్, సి. హెచ్. కృష్ణా రెడ్డి, యం.వి.జె శాస్త్రి మరియు సిబ్బంది పాల్గోన్నారు.
ఈ సందర్బంగా బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ…బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వినియోగదారులకు డిజిటల్ విధానం ద్వారా పేమెంట్స్ ను సులభతరం చేయడం వల్ల మాత్రమే నిజమైన ఫైనాన్సియల్ ఇంక్లూషనన్ను సాధించగలుగుతామని ముఖ్యంగా సహకార రంగంలో డిజిటలైజేషన్ ను ప్రమోట్ చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించవచ్చని అన్నారు.
డిజిటలైజేషన్ లో భాగంగా, మన గాయత్రి బ్యాంకు అన్ని రకాల పేమెంట్ చానల్లను అనగా UPI, AePS, IMPS, ATM, NACH వంటి వాటిని విస్తృతంగా అందుబాటులోకి తేవడం జరిగిందని వివరించారు.
అలాగే నూతనంగా డైరెక్ట్ RTGS,NEFT సేవలను లైవ్ చేసుకొని బ్యాంక్ స్వంత IFSC CODE (GABK000001) ను అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు.
కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా డిజిటల్ సేవలను ప్రమోట్ చేస్తూ సహకార రంగంలో అభివృద్ధిని సాధిస్తున్నామని తెలియజేసారు.
అలాగే సహకార వ్యవస్థలో భాగంగా, బ్యాంకింగ్ రంగంలో యూనిట్ బ్యాంకుగా 2000 సంవత్సరంలో జగిత్యాల కేంద్రంగా ప్రారంభించబడిన గాయత్రి బ్యాంకు నిరంతర కృషితో నేడు దక్షిణ భారతదేశంలో కో-ఆపరేటివ్ బ్యాంకులలో రూ॥4528.11 కోట్ల వ్యాపారంతో రెండవ స్థానానికి చేరుకున్నామని మరియు 9 లక్షల 35 వేల మంది వినియోగదారులను కలిగి దక్షిణ భారతదేశంలో కస్టమర్ బేస్ మొదటి స్థానానికి చేరుకున్నామని అన్నారు.
మరియు సభ్యుల ఆర్థిక తోడ్పాటుకై వ్యాపార రుణాలను, మార్టిగేజ్ రుణాలను, బంగారు ఆభరణాలపై రుణాలను, గృహ రుణాలను, తదితర అన్నిరకాల రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం 86 బ్రాంచీలతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల వ్యాప్తంగా విస్తరించటంతో పాటుగా, 755 మందికి ఉద్యోగ కల్పన చేయగలిగామని అన్నారు.
బ్యాంక్ అభివృద్ధికి సహకరిస్తున్న భారతీయ రిజర్వు బ్యాంకు వారికి, కేంద్ర మరియు రాష్ట్ర సహకార మంత్రిత్వశాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్యాంకు వెన్నంటి ఉండి బ్యాంకు యొక్క అభివృధ్ధికి తోడ్పాటునిస్తున్న 9 లక్షల 35 వేల మంది వినియోగదారులకు 1 లక్ష 45వేల సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
బ్యాంకు ఆవరణలో జరిగిన ఇట్టి కార్యక్రమానికి బ్యాంకు పాలక వర్గం, బ్యాంకు సిబ్బంది, సహకార సిబ్బంది మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
/publish
/publish
Publish
/done to publish
done
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.



