# Tags

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి


జగిత్యాల :

భారతీయ నాగరికత విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు.


విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు.

జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ తో పాటు శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాల పేరిట గ్రామీణ ప్రాంత విద్యార్థులకు , గోదావరి వ్యాలీ ఇండస్ట్రీస్ స్థాపించి ఎంతో మంది నిరుద్యోగులకు ఆపన్న హస్తము అందించదంతో పాటుగా వ్యవసాయదారులకు ఆధునిక పనిముట్లు తయారు చేయించడంతో వ్యవసాయదారులకు దగ్గరి బంధువయ్యాడు.

అంతేకాకుండా సమాజ సేవలో ముందుండి, జగిత్యాలలో రోటరీ క్లబ్ ను ప్రారంభించి, తద్వారా ఎన్నో సేవలు అందించి, సామాజికవేత్తగా సమాజంలో ముందున్నారు.

ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే కాకుండా ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తన వంతు సహాయ సహకారాలు అందజేశారు.

విద్యావేత్తగానే కాకుండా సామాజిక సేవా భావంతో స్వచ్ఛందంగా సేవలందించి, వ్యవసాయదారుల బంధువుగా నిలిచిన కాసుగంటి సుధాకర్ రావు మృతి పట్ల కపిల్ చిట్స్ కాసుగంటి వామన్ రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులతోపాటుగా

జగిత్యాల రోటరీ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, సిరిసిల్ల శ్రీనివాస్, మంచాల కృష్ణ, ఏ వి ఎవిఎల్ ఎన్ చారి, ఎన్.రాజు, టి వి సూర్యం, కొత్త ప్రతాప్, త్రివేణి సాగర్, ఎన్నాకుల అశోక్ తదితరులు మరియు భారతీయ నాగరిక విద్యాసమితి అధ్యాపక బృందం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

కాగా, స్వర్గీయ సుధాకర్ రావు కుమారుడు అమెరికాలో ఉన్నందున, అంత్యక్రియలు ఆదివారం గానీ, సోమవారం గానీ నిర్వహించవచ్చునని తెలుస్తుంది.