# Tags

మాదిగకుంటను అభివృద్ది చేయాలి-ప్రజల ఇబ్బందులను తొలగించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ :

పట్టణంలోని మురికినీరంతా మాదిగ కుంటలోకి చేరి డెంగ్యూ, మలేరియా వ్యాప్తికి కారణమౌతున్న దృష్ట్యా మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులతో సమన్వయం చేసుకొని కుంటను అభివృద్ది చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సూచించారు.

రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయికల్ మున్సిపల్ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం రూ.15కోట్లను మంజూరు చేసారని తెలిపారు. ఈ నిధుల నుండి ప్రజలకు అత్యవసరంగా అవసరమగు పనులు చేపట్టాలని కోరారు. రాయికల్ మాదిగ కుంట చాల ఏళ్లుగా అభివృద్దికి నోచుకోలేదని, మురికి నీరు చేరి పట్టణ ప్రజలకు ఇబ్బందిగా మారిందని ఈ కుంటను అధునీకరించేందుకు అధికారయంత్రాంగం పని చేయాలన్నారు.

ఊరిలోని మురికంతా ఈ కుంటలోకి చేరే వ్యవస్థను ప్రత్యేక డ్రైనేజీ ఏర్పాటు చేసి ఇతర చోటుకు మళ్లించాలని తద్వార కుంట మంచినీటితో ఉంటుందన్నారు. ఈ కుంటను ఆధునీకరించి సుంధరీకరణగా తీర్చిదిద్దాలని కోరారు.

వర్షం నీరు, ఎస్సారెస్పీ నీటితో కుంట నిండేలా చర్యలు తీసుకొని మున్సిపల్ నిధులతో పార్క్తో పాటు కుంట అభివృద్ది చేపట్టాలన్నారు. చాల ఏళ్లుగా ప్రజలు మురికినీరు చేరి కుంట వల్ల ఇబ్బంది పడుతున్నారని, డెంగ్యూ, మలేరియా ఇతర వ్యాధులకు కారణమౌతున్న కుంట అభివృద్ది ఇప్పుడు అధికారుల చేతుల్లో ఉందన్నారు.

రూ.5కోట్ల దాక వెచ్చించి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కుంట అభివృద్ది ద్వారా కాపాడాలని కోరారు. కుంట అభివృద్ది విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లుతానని తెలిపారు. రూ.15కోట్ల నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టే ప్రణాళికను మున్సిపల్ అధికారులు తీర్చి దిద్దాలని సూచించారు.

https://public.app/video/sp_hsvvqtrdihn30?utm_medium=ios

ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు గోపి రాజరెడ్డి,మ్యాకల రమేష్, కొయ్యడి మహిపాల్, గడ్డం గంగారెడ్డి, బాపురం నర్సయ్య, మండ రమేష్, దాసరి గంగాధర్, తలారి రాజేష్, బొద్దుల శివకుమార్, కొమ్ముల ఆదిరెడ్డి, ఏలేటి జలంధర్రెడ్డి, చిట్టి తదితరులు పాల్గొన్నారు.