# Tags

18 న ఎల్లారెడ్డిపేట మండల బిసి ల బంద్ ను విజయవంతం చేయండి:బిసి జెఎసి మండల కన్వీనర్

ఎల్లారెడ్డిపేట :

తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాదించే వరకు ఉద్యమిస్తోందని బిసి జె ఎ సి మండల కన్వీనర్ బండారి బాల్ రెడ్డి పేర్కోన్నారు.బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్బులో సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది.


ఈ సందర్భంగా బిసి జెఎసి కన్వీనర్ బండారి బాల్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 18న శనివారం ఎల్లారెడ్డిపేట మండల బీసీ బంద్ ను హోటళ్ళ యజమానులు వ్యాపార సంస్థలు, ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు బీసీ సంఘాల నాయకులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాఠశాలల యజమానులను వ్యాపార సంస్థలను 18న జరిగే బంద్ కు సహకరించి విజయవంతం చేయాలని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

42 శాతం బి సి రిజర్వేషన్ల పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినటువంటి వారు కోర్టుకు వెళ్ళి స్టేను ఎత్తివేసి బీసీలకు సహకరించాలని కోరారు.పార్టీలకు అతీతంగా బిసి బిడ్డలందరూ 18న జరిగే బిసి బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బిసి సంఘాల నాయకులు మీసం రాజం, దోమ్మాటి నర్సయ్య, షేక్ గౌస్ బాయి, మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్ ఎస్, బిజెపి, బిఎస్పి పార్టీ లకు చెందిన నాయకులు పార్టీలకతీతంగా ఏర్పడిన బీసీ జేఏసీలో స్వచ్ఛందంగా 42% రిజర్వేషన్లు సాధించుకునేంతవరకు ఐక్యమత్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.


18న నిర్వహించ తలపెట్టిన బీసీ బంద్ కు వ్యాపారస్తులు అందరూ సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు, ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన బిసి నాయకులు కంచర్ల రాజు, మందాటి దేవేందర్ యాదవ్, చోక్కి కైలాసం, కళ్యాణ్, నంది కిషన్, కంచర్ల నర్సింలు, మండే శ్రీనివాస్ యాదవ్, మేగి నరసయ్య, సిరిపురం మహేందర్, భూపతి, దుంపెన రమేష్, కదిరే శ్రీనివాస్ గౌడ్, చేట్కూరి బాలా గౌడ్, చేట్కూరి తిరుపతి గౌడ్ , ద్యాగం లక్ష్మీనర్సు, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, పూస వేర్ల లక్ష్మణ్, జర్నలిస్టులు పెంటం శ్రీనివాస్ శ్యామంతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు,