# Tags

యువ ఐఏఎస్ అధికారి అనుదీప్ కు బిట్స్ పిలానీ యంగ్ అచీవర్స్ అవార్డ్ ప్రదానం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

జగిత్యాల, జనవరి 10 :


ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల నుండి జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపిక చేసింది.

ఇందులో భాగంగా మెటుపల్లి వాసి, యువ ఐఏఎస్ అధికారి, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని పబ్లిక్ లైఫ్ కేటగిరీ లో ప్రతిభావంతమైన సేవలు చేస్తున్నందుకు గాను ‘యంగ్ అచీవర్స్ అవార్డు’ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అందజేశారు.

అనుదీప్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ గా సేవలు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… రాజస్తాన్ లోని బిట్స్ పిలానీ విద్యాసంస్థ తనను తీర్చిదిద్దిందని అందుకు తన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిర్లా గ్రూప్ సంస్థల చైర్మన్ కుమారమంగళం బిర్లా వర్చువల్ గా ప్రసంగించి అభినందనలు తెలిపారు.