# Tags
#తెలంగాణ #జగిత్యాల

కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకు… పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనం : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

👁 10 Views

జగిత్యాల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశం, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయంపై,మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య తో కలిసి మాట్లాడారు.

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థాయిలో విజయం సాధించి తమ ప్రభుత్వ పనితీరుకు అద్ధం పట్టారని అన్నారు. గత దశాబ్ద కాలంలో నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా టిఆర్ఎస్ అగ్ర నాయకులు వ్యవహరించి, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై ఆర్థిక భారం మోపి, పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై విమర్శల వర్షం గుప్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు అవేవీ పట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగు ప్రధానమైన అంశాలను అమలు చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకు వెళ్లేందుకే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు తమ పనితీరును ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వ్యవహరిస్తున్న తీరుపై ఆదరించి విజయం కట్టబెట్టారన్నారు.

రాబోయే మూడు నెలల్లో ప్రజలకుచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామనీ, రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మరింత అద్భుతంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.