# Tags

అసంపూర్తి పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌలపై సిద్దం చేయాలి :

( తెలంగాణ రిపోర్టర్ : సంపత్ పంజా):


రాజన్న సిరిసిల్ల జిల్లా


ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న తీరు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.

మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ మీద తయారుచేయాలని నిర్వాహకులకు సూచించారు. డ్రైనేజీ, నీటి సమస్యలకు పరిష్కారం చూపాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. రాగట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు రిజిస్టర్ల పరిశీలించారు. విద్యాలయానికి ప్రహరీ నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో నిత్యం అన్ని పాఠ్యాంశాలు చదివించాలని, రాయించాలని, అభ్యాసన సామర్ధ్యాల ఆధారంగా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.