# Tags
#Blog

డా. జైశెట్టి రమణయ్య పార్థివదేహన్ని సందర్శించిన కరీంనగర్ కవులు

👁 108 Views

జగిత్యాల :

👉 నివాళులర్పించిన కవులు 

ప్రముఖ చరిత్రకారులు డా.జైశెట్టి రమణయ్య (85) శుక్రవారం మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఈ సందర్బంగా కరీంనగర్ కవులు జగిత్యాల లోని ఆయన నివాసం గృహానికి వచ్చి నివాళులు అర్పించారు.ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, సమైక్య సాహితి అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్, చారిత్రక పరిశోధకులు సంకేపల్లి నాగేంద్ర శర్మ తదితరులు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో వారు రమణయ్య తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గండ్ర హన్మంత రావు స్మారక సాహితీ పురస్కారాన్ని ఆయన రాసిన స్వంత ఎదుగుదల పుస్తకానికి జగిత్యాలలో జాగృతి కవిత ద్వారా అందజేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 

వేలాదిమందిని తీర్చి దిద్దిన మహా అధ్యాపకుడు జైశెట్టి రమణయ్య అనీ, 70 ఏళ్ల డైరీలు,  రచనలు రికార్డు చేసిన అపూర్వ అనితరసాధ్యుడు ఆయన అని కొనియాడారు. 

దక్షిణ భారత దేవాలయాలు, కరీంనగర్ జిల్లా పలు క్షేత్రాల చరిత్రను పిహెచ్డీ తో ప్రామాణికంగా నిలిపిన వారు రమణయ్య అని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్బంగా డా. జైశెట్టి రమణయ్య మృతదేహన్ని సందర్శించి, నివాళులర్పించి, వినమ్రంగా జోహార్లు తెలిపారు.

డా. జైశెట్టి రమణయ్య పార్థివదేహన్ని సందర్శించిన కరీంనగర్ కవులు

Arrive Alive, A Campaign for Safer Roads

Leave a comment

Your email address will not be published. Required fields are marked *