# Tags
#తెలంగాణ #జగిత్యాల

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్

👁 18 Views

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా తపస్ కుటుంబ సభ్యులు బుధవారం రాజశేఖర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి కొక్కుల రాజేష్ లు మాట్లాడుతూ… వొడ్నాల రాజశేఖర్ తపస్ సంఘంలో సామాన్య కార్యకర్త నుండి మండల అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు అయిల్నేని నరేందర్ రావు మాట్లాడుతూ….రాష్ట్రవ్యాప్తంగా సంఘ విస్తరణకు బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైనటువంటి వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ….జిల్లా శాఖ సహకారంతో పెద్దలు నరేందర్ రావు, అశోక్ రావు, మహిపాల్ రెడ్డి మరియు జిల్లా తపస్ కుటుంబ సభ్యుల సహకారంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మీ అందరికీ అందుబాటులో ఉంటూ, సంఘ నిర్మాణంలో ముందుండి పోరాడుతానని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు వెంకటరమణ రావు, జిల్లా మాజీ అధ్యక్షులు బోనగిరి దేవయ్య, జిల్లా బాధ్యులు కొలుముల శ్రీనివాస్, మహేశ్వర్ శర్మ, మల్హాల్ రావు, కొండూరి రజనీకాంత్, నాగమల్ల రమేష్, జకిలేటి శ్రీనివాసరావు, విద్యాసాగర్, కోటేశ్వరరావు, సురేష్ వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తపస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.