# Tags
#తెలంగాణ

బెజ్జంకిలో గోదా రంగనాథ కళ్యాణం

👁 6 Views

బెజ్జంకి : (ముడికే కనకయ్య):

మండల కేంద్రంలో గుడి వద్ద లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం గోదాదేవి శ్రీ రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

అశేష భక్తజనులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి పరవశించారు.

ఆలయ అర్చకులు శేషం మధుసూదనాచార్యులు కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ యాదవ్ దంపతులు, బెజంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ ( పెద్దన్న) దంపతులు పట్టు వస్త్రాలు, ఓడి బియ్యం సమర్పించి, పెళ్లి పెద్దలుగా పీఠల పైన ఆశీనులైనారు.

ఈ కళ్యాణ మహోత్సవానికి గుండారం వాస్తవ్యులు గుర్రాల స్వాతి కృష్ణారెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ మాట్లాడుతూ….ప్రతి సంవత్సరం ధనుర్మాసం భోగి పండుగ రోజున అండాల్ అమ్మవారు ( గోదాదేవి ) శ్రీ రంగనాథ స్వామి దివ్య కళ్యాణం బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

ఈ కళ్యాణం ద్వారా వివాహ అడ్డంకులు తొలగి, దాంపత్య జీవితంలో అన్యోన్యతలు పెరిగి కుటుంబంలో శాంతి మరియు శుభమంగళాలు స్థిరపడతాయని భక్తులు విశ్వసిస్తారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది , బెజ్జంకి గ్రామ ఉపసర్పంచ్ ధూమల మహేష్,గ్రామ ప్రజలు, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బెజ్జంకి గ్రామ మాజీ సర్పంచ్ రావుల నరసయ్య , బోనాల మల్లేశం,లింగాల శ్రీనివాస్. బొంగం రమేష్ గుబిరే చంద్రం, సంగ రమేష్, సంగ రవి,ఖమ్మం నరసయ్య, బొనగం లక్ష్మీనారాయణ గౌడ్,లోనే నర్సిన్గారావు, వంగల నరేష్, సంగెం మధు, తదితరులు పాల్గొన్నారు.