# Tags
#తెలంగాణ #జగిత్యాల

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా సంగనభట్ల దినేష్ నియామకం

👁 34 Views

జగిత్యాల :

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ధర్మపురి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ధర్మపురి మండల పార్టీ అధ్యక్షులైన సంగనభట్ల దినేష్ ను ప్రభుత్వం నియామకం చేసింది.

తనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్,కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లకు మరియు తనకు సహకరించిన పెద్దలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా సంగనభట్ల దినేష్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *