# Tags
#Blog

శ్రీ దుబ్బ రాజన్న కళ్యాణమహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

👁 8 Views

మహా శివరాత్రి సందర్బంగా నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో  ఉదయాత్పూర్వం నుండి అభిషేకాది పూజా కార్యక్రమాలు 

-శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి కళ్యాణమహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

బుధవారం మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా జగిత్యాల నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో అభిషేకాది పూజా కార్యక్రమాలు ఉదయాత్పూర్వం నుండి అర్చకులు, వేదంపండితుల మంత్రోచ్చరణల నడుమ వైభవంగా సాగుతున్నాయి.

కాగా, మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా సాంప్రదాయబద్ధంగా, ఒకరోజు ముందు దుబ్బ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.ఈ సందర్బంలో ఆనవాయితీగా  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్వామివారలకు 

మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో  సారంగాపూర్ మండలం పెంబట్ల  కోనాపూర్ గ్రామంలోని శ్రీ దుబ్బ రాజ రాజేశ్వర స్వామి స్వామి వార్లకు కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యెక పూజా కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొన్నారు.

అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు, నిర్వాహకులు కలెక్టర్ ను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేయగా, దేవాదాయ శాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి సుప్రియ శాలువాతో సన్మానించారు.మహా శివరాత్రి పర్వదినం గా స్వామి వారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని,ఆ దేవ దేవుడి ఆశీస్సులు, జిల్లా ప్రజానీకం పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ నిరంతరం చేపట్టాలని వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు అందించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పలు ప్రధాన ఆలయాలవద్ద భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారం యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు గావించగా, ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందుజాగ్రత్తగా బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.

కలెక్టర్ వెంట డిపిఓ మధన్ మోహన్ ,ఎమ్మార్వో, ఎంపీడీవో ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *