# Tags

ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న నాయకులనే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

రాయికల్, ఎస్ శ్యామ్ సుందర్ :

ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి పనిచేస్తున్నవారినే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని పట్టణంలోని ప్రగతి హైస్కూల్ లో ఆదివారం నిర్వహించినవిలేఖరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు.

ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే మాట్లాడారు.
రాయికల్ పురపాలక సంఘం అభివ్రుద్దికి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నానని అన్నారు.


రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లో గతంలో పని చేసిన కాంట్రాక్టర్ లకు 3 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్ లకు చెల్లింపు చేయడం జరిగిందనీ,నేడు పనులు జరుగుతున్నాయన్నారు.
అగ్రిమెంట్ అయిపోయిన కాంట్రాక్ట్ లు EOT కింద అగ్రిమెంట్ పొడిగించి 4 కోట్ల పనులు రాయికల్ పట్టణం లో చేయటం జరిగిందన్నారు.82 లక్షలతో నూతన పనులకు కలెక్టర్ ద్వారా అనుమతులు వచ్చాయన్నారు.


రేవంత్ రెడ్డి హయంలో 1 కోటి తో మున్సిపల్ పార్కు అభివ్రుద్ది చేస్తున్నాం అన్నారు.20 లక్షలతో డివైడర్ పనులు,
15 కోట్ల రాయికల్ పట్టణ అభివ్రుద్ది కి నిధులు మంజూరు అయ్యాయన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోర హనుమండ్లు, గండ్ర రమాదేవిఅచ్యుత రావు, ఏనుగు మల్లారెడ్డి, మండల పార్టీ నాయకులు రవీందర్ రావు కోల శ్రీనివాస్ మ్యకల కాంత రావు సింగని రమేష్, మోర రామ్మూర్తి, మహేంద్ర బాబు, ఏ. లక్ష్మీ నారాయణ, రాజేష్, చంద్రతేజ, పటేల్ శివ, సంజీవ్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు