# Tags
#తెలంగాణ

రైతు భరోసా విడుదల కార్యక్రమం విజయవంతం చేయాలి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

👁 13 Views

మంథని :

మంథనిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కాటారంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రైతు భరోసా విడుదల కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తో ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు మంత్రివర్గ సహచరులు. రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొననున్నారు .

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రైతు భరోసా పథకం రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం. పాలకుర్తి మండలాల అధ్యక్షులు,గౌరవ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి గారు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

అలాగే కార్యక్రమం సజావుగా జరిగేలా బాధ్యతలు కేటాయించి, ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *