# Tags
#Blog

దసరా శరన్నవరాత్రోత్సవాల కరపత్రం అవిష్కరణ

👁 11 Views

జగిత్యాల జిల్లా…

కనక దుర్గా సేవ సమితి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయ ఆవరణలో జరిగే 22- 09 – 2025 నుండి 2 -10 -2025 వరకు జరిగే నవమ వర్ష దసరా శరన్నవరాత్రోత్సవాల వైదిక కార్యక్రమ వివరాల కరపత్రం శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య ఆవిష్కరించారు.

22 – 09 – 2025 రోజున అశేష జన వాహిని మధ్య అమ్మవారి ఊరేగింపు బైపాస్ రోడ్ నుండి మొదలై టవర్ మీదుగా అమ్మవారి మండపం కు చేరుకుంటుంది.

గోవిందుల రాధాకృష్ణ ఋత్వికుల ఆధ్వర్యంలో ఘనంగా కలశ స్థాపన చేసి అమ్మవారి భవానిలకు దీక్ష స్వీకారంతో మొదలై, ప్రతి రోజు అమ్మవారు వివిధ రూపాలలో పదకొండు రోజుల పాటు భక్తులకు దర్శనం ఇస్తారు.

మాతలు, భక్తులు పాల్గొని అమ్మవారి కృపకటాక్షాలు పొందాలని కోరారు…

కరపత్రంఆవిష్కరణ కార్యక్రమంలో కనకదుర్గ సేవా సమితి సభ్యులు, కార్యకర్తలు, భక్తులు, పాల్గొన్నారు..