# Tags
#Analytics #People #తెలంగాణ

వయోవృద్దుల సంరక్షణ భాద్యత వారసులదే : ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది

👁 12 Views

ప్రపంచ వయోవృద్దుల దినోత్సవ సందర్బంగా మంథని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి అపర్ణ మల్లాది పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,  వృద్ధుల సంక్షేమ బాధ్యత వారి వారసులదేనని, వృద్ధుల సంక్షేమ చట్టం క్రింద రెవెన్యూ డివిజన్ అధికారి కేసుల విచారణ జరిపి ఉత్తర్వులను జారీ చేస్తారని వివరించారు.

ఉల్లంఘన జరిగిన పక్షంలో కోర్టులు గరిష్ఠంగా మూడునెలల జైలు శిక్ష, 5వేల వరకు జరిమాన విధించవచ్చని పేర్కొన్నారు.

సీనియర్ న్యాయ వాదులు కె రఘోతం రెడ్ఢి, సువర్ణ చంద్రశేఖర్ చట్టం పట్ల అవగాహన కల్పించారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ,సింగరేణి కార్మికుల పెన్షనర్ అసోషియేషన్ సభ్యులు,న్యాయ వాదులు కటకం శ్రీనివాస్,సదన్ కుమార్,శశిభూషణ్ కాచె పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *