# Tags
#Blog
👁 13 Views

*ఆయిల్ ఫామ్ సాగుతో
అధిక లాభాలు

నేను గ్యారెంటీ ఇస్తా..

చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు సాగు చేయాలి..

సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలి..

అంతర పంటలు సాగు చేసుకోవచ్చు..

వ్యవసాయ పనిముట్లు అవసరమున్న రైతులు దరఖాస్తు చేసుకోండి..

అదనంగా మంజూరు చేయించి ఇప్పిస్తా..

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..*

చిగురుమామిడిలో రైతులకు వ్యవసాయ పనిముట్లు.. యంత్రాల పంపిణీ..

రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలనీ, గ్రామ గ్రామానా పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పూర్ణం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆయిల్ ఫామ్ పంట పండించడం ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని ఈ విషయంలో నేను గ్యారంటీ ఇస్తానని స్పష్టం చేశారు.

ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను మంత్రి రైతులకు పంపిణీ చేశారు. 24 మంది రైతులకు 40.80 లక్షల రూపాయల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లను అందజేశారు. 15 రోటావేటర్లు, బెయిలర్లు, పవర్ స్ప్రేయర్లు, తదితర పరికరాలు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చిన్న గ్రామంలో 50 ఎకరాలు పెద్ద గ్రామంలో 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని సూచించారు. పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చని అంతర పంటలు కూడా వేసుకోవచ్చని తెలిపారు. అత్యధికంగా ఈ పంటను సాగు చేసే గ్రామాలను మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పారు. నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫ్యాక్టరీని ఇటీవల ప్రారంభించుకున్నామని అక్కడ కొనుగోలు చేపడతారని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో అశ్వరావుపేట ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. వ్యవసాయ పనిముట్లు అవసరం ఉన్న రైతులు వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారుల ద్వారా ప్రతిపాదనలు వచ్చిన వెంటనే అదనంగా పరికరాలు మంజూరు చేయించి రైతులకు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ తరుపున చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వంలో పనిముట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గడ్డి మోపులు కట్టే బేయిలర్లు ఎక్కువగా అవసరం ఉన్నాయని చెబుతున్నారు. వాటిని ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఎక్కడా ఇబ్బందులు లేవని చెప్పారు. తాను కూడా ఆయిల్ ఫామ్ పంటను చేసేందుకు వ్యవసాయ భూమిని చూస్తున్నానని తెలిపారు. అనుకూలంగా దొరుకుతే పంటను సాగు చేస్తానని పేర్కొన్నారు. 5 ఎకరాల పైన ఉన్న వారు ఆయిల్ ఫాం సాగు చేయాలనీ కోరారు. ఆయిల్ ఫాం సాగు వల ప్రకృతి ఇబ్బందులు, కోతుల సమస్యతో పాటు ఏ ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. దానిపై నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ విజిట్ చేయాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సాగునీటి కాలువల నిర్మాణానికి అందరూ సహకరించాలని పేర్కొన్నారు.
ఇటీవల గౌరవెల్లి ప్రాజెక్ట్ పై సమావేశం జరిగిందనీ.. త్వరలోనే కాలువల పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పేమెంట్ ఇప్పిస్తామని అందరూ కాలువల నిర్మాణానికి అవసరమైన భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. అదేవిధంగా కొత్తపెళ్లి నుంచి హుస్నాబాద్ కు ఫోర్ లైన్ రోడ్ నిర్మాణ పనులకు అందరూ సహకరించాలని కోరారు.
కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యం చేయకుండా వెంటవెంటనే అందిస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, ఆర్డిఓ కే మహేశ్వర్ సర్పంచ్ ఆకవరం భవానీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి తహసిల్దార్ రమేష్, ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం స్థల పరిశీలన

చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….అధునాతన సౌకర్యాల తో 4 ఎకరాల విస్తీర్ణంలో 1-12 తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను
చేయనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థలాన్ని పరిశీలించిన ట్లు చెప్పారు. పాఠశాల ప్రాంగణం లోనే ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థలానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థలంపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో విద్యను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *