# Tags
#Nature #People #తెలంగాణ

ఆ రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్న కాలనీ ప్రజలు

👁 20 Views

కరీంనగర్ (మానకొండూర్): (ఎం.కనకయ్య)

👉 మా పొల్లగాళ్ళ పరిస్థితి చూడుండ్రి సార్. …

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని సదాశివ పల్లి స్టేజి సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్ల యజమాన్యాలు రోజురోజుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆ ప్రాంత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

👉 రైస్ మిల్ గొట్టాల నుండి వచ్చే బూడిద దుమ్ము, దూళితో అనారోగ్యం బారిన పడుతున్నాం సార్… అంటూ వేడుకోలు

వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి కాలనీ ప్రజలు తెల్లవారి సరికి వారి ఇండ్లల్లో… రైస్ మిల్ గొట్టాల నుండి వచ్చే బూడిద దుమ్ము, దూళి పేరుకుపోతుంది.

దీంతో ఆ కాలనీలో నివసిస్తున్న ప్రజలు… ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని మంగళవారం రోజున మహిళలు పరమేశ్వర రైస్ మిల్ ఆవరణలోకి పోయి, మా జీవితాలతో ఆడుకుంటున్నారంటూ యజమానులపై మహిళలు మండిపడ్డారు.

ఈ రైస్ మిల్లుల మూలంగా, చిన్నపిల్లలు, వృద్దులు అనారోగ్యంకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా వరంగల్ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులపై మిల్లుల నుండి వచ్చే దుమ్ము దూళి వారి కండ్లలో పడడంతో నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు.  

నిత్యం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న రైస్ మిల్ యాజమాన్యంలపై చర్య తీసుకోవాలంటూ ఆ కాలనీ ప్రజలు జిల్లా కలెక్టర్ మరియు పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులను వేడుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *