# Tags
#తెలంగాణ

నా కొడుకు కనిపిస్తే చెప్పండి ప్లీజ్ అంటూ, ఆ తల్లి రోదిస్తూ, వేడుకుంటుంది

👁 9 Views

జగిత్యాల జిల్లా : కోరుట్ల :

నా కొడుకు కనిపిస్తే చెప్పండి ప్లీజ్ అంటూ, ఆ తల్లి రోదిస్తూ, వేడుకుంటుంద

👉🏾 కోరుట్ల మండలం అయిలాపూర్ కు చెందిన బీటెక్ విద్యార్థి హైదరాబాద్ లో అదృశ్యం

కోరుట్ల మండలం అయిలాపూర్ కు చెందిన అంకం రాహుల్ అనే విద్యార్ధి కాచిగూడలోని ఒక హాస్టల్ లో ఉంటూ ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

అయితే ఇంటర్నల్ షిప్ కోసం MVSR కాలేజ్ కి వెళ్లిన విద్యార్థి 11 రోజులుగా కనబడకపోవడంతో కొడుకు ఆచూకీ కోసం తండ్రి రాజేష్ హైదరాబాద్ లోనే ఉండిపోయాడు.

తమ కొడుకు ఆచూకి కోసం రాహుల్ తల్లితండ్రులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా,
చివరిసారిగా కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద ఉన్న సీసీటీవీ కెమరాలో రాహుల్ కనిపించినట్లు చెపుతున్నారు.

గత నెల 27న కాలేజ్ వద్ద రాహుల్ ర్యాగింగ్ గురై అదే రోజు మిస్సింగ్ అయినట్లు రాహుల్ తల్లి వనిత
చెపుతుంది. ఈ ఘటనపై కాచిగూడ పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుండగా, నా కొడుకు కనిపిస్తే చెప్పండి ప్లీజ్ అంటూ, ఆ తల్లి రోదిస్తూ, వేడుకుంటుంది. అలాగే,  గ్రామస్థులు సైతం రాహుల్ గురించి ఎవరికీ తెలిసినా,  కనిపించినా 9618969394 లేదా,  8074856067 మరియు 6300799651 నంబర్లకు ఫోన్ చేయాల్ని కోరుతున్నారు.

జగిత్యాల జిల్లా : కోరుట్ల :

నా కొడుకు కనిపిస్తే చెప్పండి ప్లీజ్ అంటూ, ఆ తల్లి రోదిస్తూ, వేడుకుంటుంది

👉🏾

నా కొడుకు కనిపిస్తే చెప్పండి ప్లీజ్ అంటూ, ఆ తల్లి రోదిస్తూ, వేడుకుంటుంది

Telegram Post – 2026-06-07 13:49:30

Leave a comment

Your email address will not be published. Required fields are marked *