# Tags
#హైదరాబాద్

మహిళా ఆడియో ఇంజనీర్ డాక్టర్ సాజిదా ఖాన్ కు ‘సకల కళా పురస్కారం’

👁 15 Views

జగిత్యాల :

ఆడియో ఇంజనీర్ డాక్టర్ సాజిదా ఖాన్ కు ‘సిరాజ్ డాన్స్ & ఆర్ట్స్ అకాడమీ’వారి ‘సకల కళా పురస్కారం, అందజేసిన డాక్టర్ సిరాజ్ 

హైదరాబాద్ (తెలంగాణ)కు చెందిన దేశంలోనే మొదటి మహిళా ఆడియో ఇంజనీర్ డాక్టర్ సాజిదా ఖాన్, 2026 జూన్ 21న ‘సకల కళా పురస్కారాలు 2026’ను అందుకున్నారు.

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రధాన హాలులో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ‘సిరాజ్ డాన్స్ & ఆర్ట్స్ అకాడమీ’ వారి పురస్కారమును డాక్టర్ సిరాజ్ ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మరియు అతిథులు పాల్గొన్నారు.

డాక్టర్ సాజిదా ఖాన్ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆడియో ఇంజనీర్ గా ఆమె రాష్ట్రపతి పురస్కారం, తెలంగాణ రాష్ట్ర పురస్కారం మరియు అనేక ఇతర సంస్థల నుండి అనేక అవార్డులను అందుకున్నారన్నారు.

ఆమె ఒక విద్యావేత్తగా పలు అంశాలపై వివిధ సంస్థలలో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటుగా అనేక సామాజిక కార్యక్రమాలలో కూడా పలుపంచుకున్నారని డా.సిరాజ్ ఈ సందర్బంగా వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *