జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన విజయవంతం చేయండి -రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల :
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల ప్రభుత్వం అని వారికి అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గురువారం జగిత్యాల జిల్లా నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగారావు లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆడ్లూరి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా నూక పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు లేక పేదలు పడుతున్న ఇబ్బందులను గమనించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదన పంపించారని మంత్రి తెలిపారు.
ఎమ్మెల్యే గారి సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 62 కోట్లు కేటాయించిందని మంత్రి వివరించారు. నూక పల్లి డబుల్ బెడ్ రూమ్ పిల్లలు పేద మధ్యతరగతి వారు ఉండటంతో వారికి సౌకర్యాలు కల్పించడానికి నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేయడం లేదని మంత్రి తెలిపారు.
మంత్రి పర్యటనను విజయవంతం చేయండి..
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి అడ్లూరి తెలిపారు.
నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల జిల్లాకు చేరుకొని ధరూర్ క్యాంప్ వద్ద జగిత్యాల జిల్లా లో నూతనంగా మంజూరైన జగిత్యాల, మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు నూక పల్లి డబుల్ బెడ్ రూమ్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడతారని మంత్రి వివరించారు. అనంతరం జగిత్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
సాయంత్రం 4:30 గంటలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. మంత్రి పర్యటన సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు మంత్రి సూచించారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





