# Tags
#తెలంగాణ

నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

👁 56 Views


తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోబోతున్న శుభసందర్బంగా శుభాకాంక్షలు.
నందిని సిధారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ (2017-2020). మెదక్ జిల్లాలో జన్మించిన ఆయన, తన కవిత్వం మరియు పాటల ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ ఉధృతిని చాటిచెప్పారు. ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

👉 నందిని సిధారెడ్డి గురించి కవి, సాహితీవేత్త మాడిశెట్టి గోపాల్ అందించిన ముఖ్యమైన వివరాలు:
జననం: 12 జూన్ 1955.
సాహిత్య సేవ: తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
పురస్కారాలు: ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2025 – అనిమేష).
వృత్తి: అధ్యాపకుడిగా పనిచేశారు.
రచనలు: కవితా సంపుటాలు, గేయాలు, తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే రచనలు చేశారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ: తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా సేవలందించారు.

👉✍️ ఆయన రచనలు:
భూమిస్వప్నం
సంభాషణ
ఆధునిక తెలుగుకవిత్వం – వాస్తవికత – అధివాస్తవికత (సిద్ధాంతగ్రంథం)
దివిటీ
ప్రాణహిత
ఒక బాధ కాదు
నది పుట్టుబడి
ఇగురం
ఆవర్థనం
నాగేటి చాల్లల్ల (పాటలు)
ఇక్కడి చెట్లగాలి
చిత్రకన్ను (కథా సంపుటి)
అనిమేష (దీర్ఘకవిత)

పురస్కారాలు

  • 1986లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
    * 1988లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఇందూరు భారతి వారి దాశరథి పురస్కారం
    * 2001లో ప్రాణహిత కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం
    * 2009లో ఒక బాధకాదు కవితాసంపుటికి విశ్వకళాపీఠం వారి స్నేహనిధి ఉత్తమ కవితా పురస్కారం
    * 2010లో ‘నాగేటి సాలల్లో నా తెలంగాణా’ పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం
    * 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం

👉అనిమేష’ కవితా సంపుటి విశేషత :

ఈ అవార్డు తెచ్చిపెట్టిన ‘అనిమేష’ కవితా సంపుటి కేవలం అక్షరాల కూర్పు కాదు అది ఒక కాలానికి దర్పణం. ప్రపంచాన్ని వణికించిన కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాలు, వలస కూలీల కష్టాలు, ఒంటరితనాన్ని ఈ సంపుటిలో కళ్లకు కట్టారు. ‘అనిమేష’లో కరోనా సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న సామాజిక, ఆర్థిక, మానవ సంబంధ సమస్యలను నందిని సిధారెడ్డి హృద్యంగా చిత్రీకరించారు. మానవ సంబంధాల విచ్ఛిన్నత, సమాజంలో ఒంటరితనం, ఆందోళన, సామాజిక కలతలను ప్రతిబింబింపజేసే నందిని సిధారెడ్డి కవిత్వం పాఠకులకు ప్రేరణగా నిలుస్తోంది.

👉 ఉద్యమ పాటల స్వరకర్త..

‘నాగేటి సాల్లళ్ల నా తెలంగాణ’ వంటి పాటల ద్వారా తెలంగాణ పల్లె జీవనాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ప్రజలను ఉర్రూతలూగించడమే కాకుండా, స్వరాష్ట్ర ఆకాంక్షను బలోపేతం చేశాయి. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో నందిని సిధారెడ్డి పాటలు, కవిత్వం ద్వారా ప్రజలను ఆలోచింపజేశారు. ఆయన రచనలు రాష్ట్ర ఉద్యమానికి ఉత్సాహాన్ని నింపాయి.

👉 ఉద్యమంలో కీలక పాత్ర..

ప్రజల సమస్యలను కవిత్వం ద్వారా తెలియజేయడం, ఉద్యమ కవిగా ప్రజల అభిమానాన్ని పొందడం ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో నందిని సిధారెడ్డి కీలక పాత్ర పోషించారు.

👉 తెలంగాణ సాహిత్యానికి గౌరవం..

నందిని సిధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం తెలంగాణ సాహిత్యానికి, సమాజానికి, సాంస్కృతికంగా గర్వకారణమని సాహితీ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఆయన కృషి, తెలుగు సాహిత్యానికి చేసిన విశిష్టమైన సేవలు గుర్తింపుగా నిలిచాయి. తెలంగాణ ఆత్మ, జీవితం, సంస్కృతిని ప్రపంచానికి చాటిన రచయితగా నందిని సిధారెడ్డి ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని సాహితీ లోకం తెలిపింది.

👉 తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్ నందిని సిధారెడ్డి గారికి శుభాకాంక్షలు :

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, భాషా సాహిత్యాల వికాసం కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్‌గా నందిని సిధారెడ్డి సేవలు అందించారు. ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు అనేక పుస్తకాలను ఆయన వెలుగులోకి తెచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *