# Tags
#తెలంగాణ #Sport #ఎడ్యుకేషన్ & కెరీర్ #జగిత్యాల

గోపాలరావుపేటలో వాలీబాల్ కోర్టును ప్రారంభించిన జర్నలిస్టులు రంగారావు, శ్రీనివాస్ 

👁 6 Views

గోపాలరావుపేటలో వాలీబాల్, షటిల్ కోర్టులను ప్రారంభించిన జర్నలిస్టులు పి ఎస్ రంగారావు, సిరిసిల్ల శ్రీనివాస్ 

జగిత్యాల: 

జగిత్యాల అర్బన్ మండలం, తిప్పన్నపేట -గోపాలరావుపేటలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రాథమిక పాఠశాల, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకోసం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు సంఘటితంగా ఏర్పడి, వాలీబాల్ మరియు షటిల్ కోర్టులు ఏర్పాటు చేశారు.

గ్రామంలోని విద్యార్థులను,వారి వారి తల్లితండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపే విధంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ మరియు షటిల్ కోర్టులను జగిత్యాల జిల్లా సీనియర్ జర్నలిస్టులు పి ఎస్ రంగారావు, సిరిసిల్లశ్రీనివాస్ లు గ్రామ సర్పంచ్ దావా తిరుపతి, ప్రధానోపాధ్యాయులు ఎన్.వెంకటరమణ, రమేష్ మరియు గ్రామ యువకులు,  ఉపాధ్యాయ బృందంతో కలిసి ప్రారంభించారు.  

గోపాలరావుపేటలో వాలీబాల్ కోర్టును ప్రారంభించిన జర్నలిస్టులు రంగారావు, శ్రీనివాస్ 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *