# Tags
#తెలంగాణ #జగిత్యాల

రక్తదాత రవి కి సన్మానం చేసి, సన్మానించిన వైద్యులు

👁 18 Views

జగిత్యాల :
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జగిత్యాల బ్లడ్ బ్యాంకులో గురువారం 74 వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన జగిత్యాల పట్టణానికి చెందిన కనపర్తి రవిని హాస్పిటల్ సూపరిండెంట్ డా: కృష్ణమూర్త, ప్రిన్సిపల్ డా: సునీల్, డా: సైఫ్, డా: జైపాల్ రెడ్డి, డా: ప్రవీణ్, డా: గీతా , డా: రాణి, డా: విజయ్ రెడ్డి మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

అలాగే ఈ సందర్భంగా 74 సార్లు రక్తదానం చేసి, రక్తదానం అనర్థదాయకం కాదు అని చాటి చెపుతున్న సోదరుడు కనపర్తి రవికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా కమిటీ సభ్యులు, జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.

#రక్తదానం చేయండి
ప్రాణదాతగా నిలవండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *