జగిత్యాల : (sircilla srinivas):
రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకుని, రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్ట్ లో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆదాలత్, అందరి సహకారంతో సత్ఫలితాలు సాధిస్తున్నామని, జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ జాతీయ మెగా లోక్ ఆదాలత్ ద్వారా అందిస్తున్న అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు .

జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలనే లక్యంతోనే లోక్ఆదాలత్ నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో 17074 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు.

ఇందులో 5134 సివిల్ కేసులు కాగా 11940 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు.

ఇందుకోసం బార్ అసోషియోషన్ సభ్యులు, మీడియేటర్స్, పోలీసు అధికారులు, ఇతర న్యాయవాదులు చాల కృషి చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పస్ట్ అడిషనల్, సెషన్ జడ్జ్ ఎస్. నారాయణ, సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ పాల్గొన్నారు.

Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





