# Tags

17 ఏప్రిల్ న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన..

  • టీజీఈజెఏసి జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మాణం

రాష్ట్ర జేఏసీ సూచనల మేరకు బుధవారం టీజీఈజేఏసి జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం JAC జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కన్వీనర్ కందుకూరి రవి బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ఉద్యోగ,గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ,కార్మిక పెన్షనర్స్ మరియు క్లాస్ ఫోర్, ఔట్సోర్సింగ్ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశం (తేది: 07-04-2026)లో తీసుకున్న తీర్మానాల మేరకు, గౌరవ TGEJAC రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరీ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు… రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయుటలో భాగంగా…
తేదీ:17.4.2026 (శుక్రవారం) రోజున మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జిల్లా కేంద్రం లో కలెక్టరేట్ (IDOC) ఎదుట, డివిజన్ మరియు అన్ని మండల కేంద్రాలలో TGEJAC జగిత్యాల జిల్లా పక్షాన భోజన విరామ సమయంలో జేఏసీ సభ్యలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా తెలిపారు.

TGEJAC ప్రధానంగా క్రింది నాలుగు కీలక డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతోంది:

1). “ 2వ పిఆర్సి అమలు:*
పిఆర్సి కమిటీ ఏర్పాటు అయ్యి దాదాపు 30 నెలలు పూర్తయిన నేపథ్యంలో, నివేదికను వెంటనే తెప్పించి, జూన్ 2లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

2).“ పెండింగ్ బిల్లుల విడుదల:*
రాష్ట్రంలో సుమారు ₹13,000 కోట్ల పెండింగ్ బిల్లులను ఏకమొత్తంగా విడుదల చేసి, ప్రతినెల రిటైర్ అవుతున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

3). ఆరోగ్య కార్డుల అమలు (EHS):*
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య కార్డుల విధివిధానాలను రూపొందించి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

4). “ CPS రద్దు – OPS పునరుద్ధరణ :*
రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (OPS)ను పునరుద్ధరించాలని,
ఇవి కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని TGEJAC కోరింది.
ఇట్టి సమావేశంలో వీరితోపాటు TGEJAC జిల్లా కో చైర్మన్లు ఎండి.వకీల్, మామిడి రమేష్, ఊకంటి అమరేందర్ రెడ్డి, PRTU యాల్ల అమరనాథ్ రెడ్డి, STU భైరం హరికిరణ్, TRTF తుంగూరి సురేష్, DTF ఎన్నం రాంరెడ్డి, వివిధ సంఘాల జిల్లా నాయకులు సాహెద్ బాబు, గుర్రం శ్రీనివాస్ గౌడ్, హన్మంత రెడ్డి, చంద్ర శేఖర్, సుగుణాకర్, రాజశేఖర్, మధుకర్, హఫీజ్, శ్రీనివాస్, అరుణ, మధుసూదన్, మల్లయ్య, నగేష్, అక్షయ్, సుజాత లక్ష్మి, మాధవి, రహీం, గణేష్, సత్తయ్య, గంగాధర్, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *