# Tags

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

రాయికల్ : (S. Shyamsunder) బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో  జిల్లాలోని పలు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు. రాయికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల బాలుర, కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేడిపల్లి జిల్లా ఉన్నత పాఠశాల  పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  గురువారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్  కేంద్రాలలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి పలు […]

శ్రీ దుబ్బ రాజన్న కళ్యాణమహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

మహా శివరాత్రి సందర్బంగా నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో  ఉదయాత్పూర్వం నుండి అభిషేకాది పూజా కార్యక్రమాలు  -శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి కళ్యాణమహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ బుధవారం మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా జగిత్యాల నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో అభిషేకాది పూజా కార్యక్రమాలు ఉదయాత్పూర్వం నుండి అర్చకులు, వేదంపండితుల మంత్రోచ్చరణల నడుమ వైభవంగా సాగుతున్నాయి. కాగా, మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా సాంప్రదాయబద్ధంగా, ఒకరోజు ముందు దుబ్బ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల […]

రాయికల్ త్రికూటాలయంలో శివరాత్రి వేడుకల ఏర్పాట్లు పూర్తి

రాయికల్ : ఎస్. శ్యాంసుందర్ బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండల కేంద్రంలోని ప్రధాన శివాలయం త్రికూటాలయంలో శివరాత్రి వేడుకలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిగా గావించారు . అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ, శివుడిని కొలిచే శివరాత్రి ఉత్సవావేడుకల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అభిషేకాది పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించి ఆలయాన్ని ముస్తాబు గావించారు. మహాశివరాత్రి […]

పెద్ద చెరువును ఎస్సారెస్పీ నీటితో నింపాలి : రైతు నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి

రాయికల్ : S. Shyamsunder వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటి కష్టాలు రాకుండా పెద్ద చెరువుnu ఎస్సారెస్పీ నీటీ తోనింపాలని రైతు నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణ పెద్ద చెరువు ను ఎస్సారెస్పీ డి- 52కెనాల్ నీటితో నింపాలని రాయికల్ తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహసిల్దార్ కు మంగళవారం రైతులు వినతి పత్రాన్ని అందించారు. గత సంవత్సరం చెరువులో నీటి స్థాయి అధికంగా ఉందని ప్రస్తుతం చెరువులోని నీటి భూగర్భ స్థాయికి […]

అంబరాన్నంటిన 75 వసంతాల వజోత్సవ వేడుకలు-హన్మాజిపేట స్కూల్లో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల జన జాతర 1949-2025 వజ్రోత్సవం – మహానందోత్సవం హన్మాజిపేట ఒడిలో 75 ఏళ్ల బడి పండుగ హనుమాజీపేటను సినారె మండలంగా ప్రకటించాలని డిమాండ్ వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల వజ్రోత్సవ 75 వసంతాల వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. పదోతరగతి చదివిన అనంతరం కొన్నేళ్లకు పూర్వ విద్యార్థుuలు ఆత్మీయ సమ్మే శనం జరుపుకోవడం షరా మామూలే. కానీ ఇక్కడ మాత్రం 75 వసంతాల పూర్వ విద్యార్థుల వజ్రోత్సవ వేడుకలు […]

కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత 

కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత  శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల క్రీడా & సాంస్కృతిక దినోత్సవమును పురస్కరించుకుని కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో శనివారం, కళాశాలలోని ప్రధాన గ్రూప్ లలో ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు సుమారు 2.50 లక్షల విలువ గల నగదు పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ. […]

విద్యార్థులకు కాసుగంటి కుటుంబంచే ప్రతీ సంవత్సరం అందించే నగదు ప్రోత్సాహం

జగిత్యాల : ఫిజికల్ సైన్స్ గ్రూప్ లో టాపర్ : వకీల్, మాజీ శాసనసభసభ్యుడు కాసుగంటి లక్ష్మీనర్సింహారావు అవార్డు : నాగుల పూజ, గ్రామం: జగదేవ్ పేట మండలం, వెల్గటూర్.  లైఫ్ సైన్స్ గ్రూప్ లో టాపర్ గా : కాసుగంటి సుధాకర్ రావు అవార్డు : దర్శనల హారిక, గ్రామం వల్లంపల్లి, మండల్ : మేడిపల్లి. కామర్స్ గ్రూప్ లో టాపర్ గా : కాసుగంటి వామన్ రావు (సి.ఎ..) అవార్డు ముద్దమల్ల కిషన్, గ్రామం, […]

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి…

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి నన్నుతరింపజేసిన తీరు …!!! దర్శించితిని తల్లి !!వేములవాడ సామ్రాజ్ఞి …!!!నిను నవ వధువుగా,కాత్యాయనివై తపంబున గెలిచి రాజేశ్వారుణ్ణి మనువాడి , మెట్టినింట(కైలాసంబున) అడుగుపెట్టగా…!!! బ్రాహ్మీ ముహూర్తమందు నల్లని చీకటిని దట్టమైన నీ కేశభారములుగా ,నక్షత్రాలను శివయ్య వేసిన తలంబ్రాలుగా , అటుగా ఉన్న పాలపుంతను జీలకర్రాబెల్లపు ముద్దగా ,శేష చంద్రుని కాంతిని నీ నుదుటన బాసింగముగా దర్శించితిని తల్లీ రాజ రాజేశ్వరివేములవాడ సామ్రాజ్ఞి …!!! తొలిసంధ్యన ఉదయించిన […]

శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్  బాబు

ధర్మపురి  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఆలయానికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబుకు ఆలయ అర్చకులు స్వాగతం […]

ఈ ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే -రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధర్మపురి… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘం హాల్ప లో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్సీ అభ్యర్థి […]