జగిత్యాల :
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో మరియు ఎల్ఐసి తదితర భీమా సంస్థల్లో క్లైమ్ చేయకుండా ఉన్న డిపాజిట్లు, భీమా మొత్తాలు మన జిల్లాకు సంబంధించి 36 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా ఆర్బీఐ నివేదిక తెలిపిందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తెలిపారు.

, వాటిని తిరిగి పొందేందుకై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో “మీ డబ్బు – మీ హక్కు” అన్న నినాదంతో ఈనెల 23 వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు రామ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 23 వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా పరిధిలోని వివిధ బ్యాంకులు, ఎల్ఐసి తదితర భీమా సంస్థల స్టాల్స్ ఏర్పాటు చేసి క్లైమ్ చేయని డిపాజిట్లు, భీమా మొత్తాలపై పూర్తి సమాచారం అందిస్తామని తెలిపారు.
తమకు లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన క్లైమ్ చేయని ఖాతాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉందని క్లైమ్ విధానం, అవసరమైన పత్రాలు, దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
పదేళ్లకు పైబడి బ్యాంకుల్లో క్లైమ్ చేసుకోకుండా ఉన్న నిల్వ వివరాలు ఆర్బీఐ ఉద్గం వెబ్సైట్ లో పొందవచ్చని ఆయన అన్నారు.
కావున జిల్లా లోని ప్రజలు తమ గుర్తింపు పత్రాలు, ఖాతా వివరాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ కోరారు.
–
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





