వైద్యుడిగా సేవ…సామాజిక కార్యకర్తగా అంకితభావం.. ప్రజాప్రతినిధిగా అభివృద్ధి…
జగిత్యాల :
“బెస్ట్ డాక్టర్ అవార్డు”ను రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్
ఈ మూడు లక్షణాల సమ్మేళనమే జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
రచన : “ సిరిసిల్ల శ్రీనివాస్ ”, తెలంగాణ రిపోర్టర్, ఎడిటర్
జగిత్యాల నియోజకవర్గ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్.
“వైద్యం వృత్తిగా… సేవ జీవన విధానంగా…” అనే మాటకు నిదర్శనంగా నిలిచే డాక్టర్ సంజయ్ కుమార్, ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రజానాయకుడు.
ఆయన ఒక ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు మాత్రమే కాదు, సేవాభావం కలిగిన సామాజిక కార్యకర్త కూడా. మూడు దశాబ్దాలుగా కంటి వైద్య సేవల ద్వారా వేలాది మందికి వెలుగు నింపుతూ ప్రజల ఆదరణ పొందారు.
శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ, తన వైద్య వృత్తిని విడిచిపెట్టకుండా ప్రతిరోజూ కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు నిర్వహించడం ఆయన ప్రత్యేకత.
ముఖ్యంగా ప్రతి వారం ఆర్థిక స్థోమత లేని పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసి ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. వేలాది ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి “ప్రజల డాక్టర్”గా మంచి పేరు సంపాదించారు.

ఇండియన్ రెడ్ క్రైస్ సొసైటీ శాశ్వత సభ్యుడిగా, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడిగా, ఆపి ప్రెవేంటివ్ హెల్త్ క్లినిక్ సంస్థ జగిత్యాల వ్యవస్థాపకుడిగా కూడా డాక్టర్ సంజయ్ కుమార్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలు, కంటి పరీక్షా శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా ఆయా సంస్థల సభ్యుల సంఘాటిత సహకారంతో సమాజానికి సేవలందించారు.
ప్రజాప్రతినిధిగా జగిత్యాల అభివృద్ధికి నిరంతరం తనవంతుగా కృషి చేస్తున్నారు. రోడ్లు, వైద్య సదుపాయాలు, విద్యా సంస్థలు, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు వంటి అనేక రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గ పురోగతికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేసే నాయకుడిగా గుర్తింపు పొందారు.

అందుకే ప్రజాసేవను పరమోన్నతంగా భావిస్తూ, వైద్య సేవలను నిరంతరం కొనసాగిస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ కు విశిష్ట గౌరవం దక్కింది.
ప్రముఖ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన “బెస్ట్ డాక్టర్ అవార్డు”ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అందుకోవడం జగిత్యాల ప్రజలకు గర్వకారణం.
ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారంలో అహర్నిశలు శ్రమిస్తూనే, మరోవైపు నేత్ర వైద్య నిపుణుడిగా ప్రతిరోజూ కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా ప్రతి వారాంతంలో పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తూ వేలాది మందికి వెలుగు నింపుతున్నారు.

ఇండియన్ రెడ్ క్రైస్ సొసైటీ శాశ్వత సభ్యుడిగా, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడిగా, ఆపి ప్రెవేంటివ్ హెల్త్ క్లినిక్ సంస్థ జగిత్యాల వ్యవస్థాపకుడిగా సామాజిక సేవలోనూ ముందుండే డాక్టర్ సంజయ్ కుమార్, వైద్య సేవలను కేవలం వృత్తిగా కాకుండా, మానవ సేవగా భావించి పనిచేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యం, నియోజకవర్గ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు — ఈ మూడు రంగాల్లో సమాన నిబద్ధతతో కృషి చేస్తూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

“వైద్యం వృత్తిగా… సేవ జీవన విధానంగా…” అనే మాటకు నిదర్శనంగా నిలిచే డాక్టర్ సంజయ్ కుమార్, ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రజానాయకుడని గుర్తింపు తెచ్చుకున్న సందర్భంలో… జర్నలిస్ట్ గా, తెలంగాణ రిపోర్టర్ news channel ఎడిటర్ గా, ఇండియన్ రెడ్ క్రైస్ సొసైటీ శాశ్వత సభ్యుడిగా, రోటరీ క్లబ్ మాజీ అసిస్టెంట్ గవర్నర్ గా, ఆపి ప్రెవేంటివ్ హెల్త్ క్లినిక్ సంస్థ జగిత్యాల సభ్యుడిగా జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కు శుభాకాంక్షలు…శుభాభినందనలు….
జైహింద్. ..జై తెలంగాణ…
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





