# Tags
#Blog

ర్యాగింగ్ కు పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలులో వున్నాయి : ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది

👁 21 Views

మంథని :

మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం జేఎన్టీయు మంథని ఇంజనీరింగ్ కళాశాలలో “ ర్యాగింగ్ పై న్యాయ విజ్ఞాన సదస్సు ” లో మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది పాల్గొన్నారు. 

ఈ  సందర్బంగా  అపర్ణ మల్లాది మాట్లాడుతూ…యుజిసి మార్గదర్శక ప్రకారం విద్యా సంస్థలలో ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలతో పాటు,అనేక మార్గదర్శకాలు అమలులో ఉన్నాయని వివరించారు.

ఎవరేని వ్యక్తులు తోటి విద్యార్థులపై కళాశాల ప్రాంగణంలో గానీ, బయట గానీ ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన శిక్ష లు పడతాయని హెచ్చరించారు. 

ర్యాగింగ్ అనైతిక చర్య,అమానవీయం అని పేర్కొన్నారు.భారతీయ సంసృతిలో ఇలాంటి చర్యలకు అవకాశం లేదని సత్ప్రవర్తన తో చట్ట బద్ధంగా మసలుకోవాలని కోరారు.

బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ…ర్యాగింగ్ పాశ్చాత్య సంసృతని, మనం చట్ట బద్ధమైన పౌరులుగా ఇతరుల హక్కులకు భంగం వాటిల్ల కుండా జాగ్రత్తగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా వుండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర్. సుదా రాణి, ద్వితీయ శ్రేణి న్యాయ మూర్తి అనురాధ, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్, న్యాయవాదులు శశిభూషణ్ కాచె, నూనేటి ఆంజనేయులు, సి.ఐ.బుద్దే స్వామి, ఎస్.ఐ. టి.శ్రీనివాస్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణ ప్రనీత్, జె.ఎన్టీ ఫిజికల్ డైరెక్టర్ పింగిలి కృష్ణ రెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *