కోకాకోలా కంపెనీ సీఎస్ఆర్ నిధులతో రూ.2 కోట్లతో అభివృద్ధిపనులకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు భూమి పూజ
మంథని :
👉 నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు
👉 కోకాకోలా ఫ్యాక్టరీ ఏర్పాటుతో పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామిక రంగానికి మరింత ఊతం
మంథని :
పట్టణంలో నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు.
నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భూమిపూజ :
అదే విధంగా మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణ, కట్ట పై సుందరీకరణ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు భూమిపూజ చేశారు.
కోకాకోలా కంపెనీ సీఎస్ఆర్ నిధులతో రూ.2 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
చెక్‌డ్యాంలో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, కట్టపై వాక్‌వే, చిన్నారుల పార్క్, పచ్చదనం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మంథని పట్టణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని….కోకాకోలా కంపెనీ తో యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడించారు.
👉🏾 కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలం పరిశీలన :
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ శివారులో ప్రతిపాదిత కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన సుమారు 250 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కోకాకోలా సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరిశీలించారు.

ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూమి, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల పై అధికారులు మంత్రికి వివరాలు అందించారు.ఈ సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన అన్ని అంశాలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
కోకాకోలా ఫ్యాక్టరీ ఏర్పాటుతో పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని శ్రీధర్ బాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





