# Tags
#Blog

ఎల్లారెడ్డిపేట నూతన ఎస్సైకి టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సభ్యుల సన్మానం

👁 15 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఎల్లారెడ్డిపేట :

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంకు నూతనంగా వచ్చిన ఎస్ఐ రమేష్ గౌడ్, శనివారము బాధ్యతలు స్వీకరించారు .

ఆదివారం రోజున టీయూడబ్ల్యుజే అనుబంధ ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి ఎస్ఐ రమేష్ గౌడు కు శాలువాతో సన్మానం చేశారు. 2014వ సంవత్సరం బ్యాచ్ కి చెందిన రమేష్ గౌడ్ బెల్లంపల్లి రామడుగు 3 టౌన్ పోలీస్ స్టేషన్ తో పాటుగా వివిధ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ, సాధారణ బదిలీల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని తెలిపారు.

ఎవరికి అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ప్రతి పోలీసు సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వచ్చేవారికి న్యాయం చేస్తారని తెలిపారు. శాంతి భద్రతలకు విగాదం కలిగించి అసాంఘీక కార్యక్రమాలు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ , పోతుల గాంధీ రెడ్డి, రాజనర్సు, ఏర్పుల నారాయణ, జనగామ రమేష్, మారేపు భూశంకర్, పుల్లూరి సత్యనారాయణ, తిరుపతి, ముద్రకోల కృష్ణ రెడ్డి, మల్ల నరసయ్య, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

ఎల్లారెడ్డిపేట నూతన ఎస్సైకి టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సభ్యుల సన్మానం

పంచాంగము 12.08.2026

Leave a comment

Your email address will not be published. Required fields are marked *