# Tags
#Events #ఎడ్యుకేషన్ & కెరీర్ #జగిత్యాల #తెలంగాణ

జీవితానికి సుస్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు-పొలాసలో అవగాహన కార్యక్రమం

👁 34 Views

జగిత్యాల :పొలాస

తల్లిపాల వారోత్సవాలలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొలాస సెక్టార్ పరిధిలోని తల్లులకు అవగాహనా కార్యక్రమం 

తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జగిత్యాల మండలం పొలాస గ్రామంలో మహిళాభివృద్ధి, మరియు శిక్షగు సంక్షేమ శాఖ icds project ఆధ్వర్యంలో పొలాస సెక్టార్ పరిధిలోని తల్లులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి డా ఆడెపు భాస్కర్, icds అధికారిణి జయప్రద, సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ ల ఫోరమ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ మరియు వార్డ్ మెంబర్స్ ఫోరమ్ జిల్లా ప్రెసిడెంట్, గ్రామపంచాయతి వార్డ్ సభ్యులు ఉప్పు కిషన్, వార్డ్ మెంబర్ కుర్మ రాజు, జీపీ సెక్రటరీ సత్తిరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, అంగన్ వాడి టీచర్లు, సూపెర్వైజర్లు, పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా icds సూపెర్వైసోర్లు, మహిళా ఉద్యోగులు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.

జిల్లా సంక్షేమశాఖ అధికారి డా.భాస్కర్ మాట్లాడుతూ, పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే తల్లిపాలు అమృతమనీ, అవి  ప్రధానమన్నారు. తల్లిపాలు సమృద్దిగా రావాలంటే తల్లి మంచి పోషకాహారం తీసుకోవాలన్నారు. 

ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తారన్నారు. ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, తల్లులు మరియు శిశువులకు అవసరమైన సహాయాన్ని అందించడం అని వివరించారు. 

“జీవితానికి సుస్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు అని పేర్కొంటూ, తల్లిపాల ప్రయోజనాలు వెల్లడించారు.పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించడం శిశువుకు అత్యుత్తమ రక్షణ అనీ, మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు.

శిశువుకు సంపూర్ణ పోషకాహారం, రోగనిరోధక శక్తిని అందిస్తాయనీ, తల్లి–శిశువు మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాదంతో పాటుగ,  తల్లికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు.  అనంతరం పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *