ఈ నియమాలు పాటించకుంటే, NEET పరీక్ష రాయలేరు, జాగ్రత్త!
జగిత్యాల :
మే 3న రేపు నీట్- 2026 ప్రవేశ పరీక్ష, జగిత్యాల జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు : జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి
-3 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయనున్న 796 మంది విద్యార్థులు
-SKNR డిగ్రీ కళాశాలలో ఒకటి, JNTU ఇంజనీరింగ్ కాలేజీలో 2 పరీక్ష కేంద్రాలు
దేశవ్యాప్తంగా మే మూడవ తేదీన National Testing Agency ద్వారా నిర్వహించబడుతున్న నీట్- 2026 ప్రవేశ పరీక్ష కోసం జగిత్యాలజిల్లాలోఅన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి శనివారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.

జాతీయ ప్రాధాన్యత గల ఈ పరీక్ష జగిత్యాల జిల్లాలోని మూడు కేంద్రాలలో ఒకటి SKNR Government Arts and Science కాలేజీలో 360 మంది విద్యార్ధులు, మరో రెండు కేంద్రాలు నాచుపల్లి కొండగట్టులోని JNTU ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయని వాటిలో ఒక కేంద్రంలో 240 మంది విద్యార్ధులు, మరొక కేంద్రంలో
196 మంది విద్యార్ధులు హాజరవుతారని పేర్కొన్నారు.
ఈ పరీక్షకు మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తం 796 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు.
ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. దివ్యాంగులైన అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వబడుతుంది.

ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
మధ్యాహ్నం 1:30 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వబడదు.
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కేవలం క్రింది వస్తువులను మాత్రమే తీసుకురావాలి:
అడ్మిట్ కార్డ్ / హాల్ టికెట్
ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడి / పాన్ కార్డ్ మొదలైనవి)
సాధారణ (పారదర్శక) వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించబడుతుంది
రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలి
అడ్మిట్ కార్డ్ లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరించబడుతుంది. విద్యార్థులు రాయడానికి అవసరమైన పెన్నును పరీక్షా కేంద్రంలోనే NTA అధికారులే అందజేస్తారు. ఆ పెన్నుతోనే పరీక్ష రాయాలి. విద్యార్ధులు క్రింది పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకురావడం నిషేధించబడింది:
ఏ విధమైన స్టేషనరీ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, మైక్రోఫోన్లు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్లు, గాగుల్స్, హ్యాండ్ బ్యాగులు, బెల్లట్లు, క్యాప్లు, గడియారాలు (వాచ్లు), బ్రేస్లెట్లు, కెమెరాలు, ఆభరణాలు, మాల్ట్రాక్టీస్కు సంబంధించిన ఏ వస్తువులు, ఆహార పదార్థాలు, లోహ పదార్థాలు తదితరాలు అనుమతించబడవు.
ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా నీట్ కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రవాణా, ఆరోగ్య, త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
పోలీస్ శాఖకు కూడా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఫోటో స్టూడియోలు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.
నీట్–2026 పరీక్షను పగడ్బందీగా నిర్వహిస్తూ ఎలాంటి తప్పిదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందని కె. బ్రహ్మానంద రెడ్డి తన ప్రకటనలో వివరించారు.f
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





