# Tags
#తెలంగాణ

టిఎన్జీఓ భవన్ లో డా.బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు

👁 8 Views

జగిత్యాల :
భారత రాజ్యాంగ సృష్టి కర్త, భారతరత్న, బాబా సాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గారి 133 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా టిఎన్జీఓల సంఘ భవనంలో జిల్లా అద్యక్షులు భోగ శశిధర్, జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మరియు నాయకులు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.

జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మాట్లాడుతూ విద్యావంతులు, జాతీయ న్యాయవాది, రాజకీయ వేత్త, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డా. బిఆర్. అంబేద్కర్ గారి జీవితం మనందరికీ మార్గదర్శకమని, ఆయన యొక్క ఆశయాలను మనందరం కొనసాగించాలని, ఆయన చూపిన బాటలో మనమందరం నడవాలని, భారత జాతి నిర్మాణం లో ఆయన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా వారిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో టిఎన్జిఒ నాయకులు సాహెద్ బాబు, రవిందర్, రాజేందర్, రాజేశం, , మధుకర్, సుగుణాకర్, శ్రీనివాస్, మమత, రాజశ్రీ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, వేణు, ఉద్యోగులు పాల్గొన్నారు.

టిఎన్జీఓ భవన్ లో డా.బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *