# Tags
#తెలంగాణ

ఎల్ఐసి కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు

👁 18 Views


కరీంనగర్ : (ముడికే కనకయ్య)

అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు శనివారం భారతీయ జీవిత బీమా సంస్థ కరీంనగర్ డివిజన్ ఆఫీసులో వైభవంగా జరిగాయి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం సెలవు దినం కావడం వలన సీనియర్ డివిజనల్ మేనేజర్ శివ నాగ ప్రసాద్, మరియు మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్ మహిళా ఉద్యోగినులందరికీ పుష్పాలతో. అభినందనలు తెలిపి స్వీట్లు పంచారు.

ఈ సందర్భంగా భారతీయ జీవిత బీమా సంస్థ క్లాస్ వన్ ఫెడరేషన్ యూనియన్ ఉద్యోగులు, మహిళా స్వశక్తి సదన్, అనాథ మహిళాశ్రయానికి రెండు కూలర్లు మరియు ఐదు పరుపులు వితరణ చేశారు.

ఈ సందర్భంగా ఎస్ డి ఎం శివ నాగ ప్రసాద్ మాట్లాడుతూ… నేలను కూడా భూమాత, నేల తల్లి అని గౌరవించే మంచి సంస్కృతి ఉన్న దేశం మనది, క్లాస్ వన్ ఫెడరేషన్ యూనియన్ ఉద్యోగులు చేసిన వితరణ అభినందనీయ మన్నారు.

ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్, క్లాస్ వన్ యూనియన్ సెక్రటరీ రాజనరేందర్, ప్రెసిడెంట్ విజయ్ కుమార్, వుమెన్ కన్వీనర్ సుజనా దేవి, మేనేజర్లు వెంకట్ రఘు, స్రవంతి లు మహిళలకు అభినందనలు తెలిపారు.

https://youtu.be/D6_AP165sXE

ఈ సమావేశంలో ఫణి కుమార్, ఇందిర, రాధారమణి, మాధవి, వసుమతి, లక్ష్మి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *