# Tags
#తెలంగాణ

చిగురుమామిడి మండల మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ గీకురు రవీందర్ లేని లోటు బాధాకరం : ఎంపీ ఈటల రాజేందర్

👁 9 Views

చిగురుమామిడి : ముడికే కనకయ్య :

రవీందర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఈటల రాజేందర్

తెలంగాణ ఉద్యమ సహచరులు, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ మృతి చాలా బాధాకరం అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిగురుమామిడి మండల మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ గీకురు రవీందర్ ఇటీవల ఆకస్మాత్తుగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ సందర్బంలో రవీందర్ కుటుంబ సభ్యులను మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డిలు శుక్ర వారం పరామర్శించారు.రవీందర్ చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ ఉద్యమ సహ చరులు, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ మృతి చాలా బాధాకరం అని, ఆప్తుడైన రవీందర్ ఇలా మరణించడం కుటుంబానికి, చిగురుమామిడి మండల ప్రజలకు తీరని లోటన్నారు.

ఎంపి ఈటల రాజేందర్ వెంట చిగురుమామిడి మండల అధ్యక్షుడలు పోలోజు సంతోష్, మండల ప్రధాన కార్యదర్శి గునుకుల మధుసుదన్ రెడ్డి, తిప్పారపు శ్రీనివాస్, ఉపా ధ్యక్షులు గండే చిరంజీవి, పెసరి హరీష్, ఓబీసీ మోర్చ్ మండల అధ్యక్షులు పడాల శ్రీనివాస్, యువ మోర్చ అధ్యక్షులు సిద్ధంకి అనిల్, నక్క రాజేందర్, మామిడి రమేష్ ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *