# Tags
#తెలంగాణ

మహిళలు,విద్యార్థినులు నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించండి…జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

👁 11 Views

మహిళలు,విద్యార్థినులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించండి…. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (తెలంగాణ రిపోర్టర్ )

విద్యార్థినులు,మహిళలు అభద్రతభావానికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ మహిళ రక్షణ విభాగంచే నూతనంగా రూపొందించిన షీ టీం,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ ల వాల్‌ పోస్టర్లను ఎస్పీ అవిష్కరించారు.

ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ… మహిళలు బాలికల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, బాలికలు,అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వుండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విద్యార్థినిలు, బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.

ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆకతాయిల పై నిరంతరం జిల్లా షి టీమ్ పర్యవేక్షణ చేస్తున్నాయని,మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు జిల్లా షీ టీం 8712656425 నంబర్ కి సమాచారం అందించాలని,మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *