సంఘటితంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం : జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లీపూర్ నందు వాటర్ ప్లాంట్ మరియు బాస్కెట్బాల్ కోర్టును గురువారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో జిల్లా విద్యాధికారి కే. రాము ప్రారంభించారు. ఈ సందర్బంగా డి ఈ ఓ రాము మాట్లాడుతూ…ఏ ఒక్కరితో అభివృద్ధి సాధ్యం కాదని అందరూ కలిసికట్టుగా సంఘటితంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 2024- 25 10వ తరగతి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులు చందాలు వేసుకొని పాఠశాలలో విద్యార్థుల కొరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. […]


