# Tags

25 సంవత్సరాల తర్వాత ఘనంగా శారద విద్యాలయం జగిత్యాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జగిత్యాల : పట్టణంలోని శారదా విద్యా నిలయం పాఠశాలలో 1999–2000 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉల్లాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ కాలం నాటి సహపాఠులు, ఉపాధ్యాయులు, మరియు పాఠశాల యాజమాన్యం అండ్ హెడ్మాస్టర్ శ్రీ పునుగోటి నీరజాకుమారి రంగారావు గారు పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాస కాలంలో పొందిన అనుభవాలను పంచుకుంటూ, గురువుల మార్గదర్శకత తమ జీవితాల్లో ఎంతగానో ఉపయోగపడిందని […]

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు భూమి పూజ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీతీరం వెంట ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు భూమి పూజ నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత ప్రాతిపదికన దేవాలయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యం మేరకు 198 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి […]

రైతు భరోసా విడుదల కార్యక్రమం విజయవంతం చేయాలి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని : మంథనిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కాటారంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రైతు భరోసా విడుదల కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తో ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు మంత్రివర్గ సహచరులు. రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొననున్నారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ […]

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు.  ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు […]

17 ఏప్రిల్ న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన..

రాష్ట్ర జేఏసీ సూచనల మేరకు బుధవారం టీజీఈజేఏసి జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం JAC జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కన్వీనర్ కందుకూరి రవి బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ఉద్యోగ,గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ,కార్మిక పెన్షనర్స్ మరియు క్లాస్ ఫోర్, ఔట్సోర్సింగ్ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) రాష్ట్ర కమిటీ […]

ఆ రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్న కాలనీ ప్రజలు

కరీంనగర్ (మానకొండూర్): (ఎం.కనకయ్య) 👉 మా పొల్లగాళ్ళ పరిస్థితి చూడుండ్రి సార్. … కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని సదాశివ పల్లి స్టేజి సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్ల యజమాన్యాలు రోజురోజుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆ ప్రాంత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  👉 రైస్ మిల్ గొట్టాల నుండి వచ్చే బూడిద దుమ్ము, దూళితో అనారోగ్యం బారిన పడుతున్నాం సార్… అంటూ వేడుకోలు వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి కాలనీ […]

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా సంగనభట్ల దినేష్ నియామకం

జగిత్యాల : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ధర్మపురి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ధర్మపురి మండల పార్టీ అధ్యక్షులైన సంగనభట్ల దినేష్ ను ప్రభుత్వం నియామకం చేసింది. తనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్,కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, వేములవాడ […]

Arrive Alive, A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

జగిత్యాల జిల్లా… అతివేగం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 👉 డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి 👉 పోలీస్ కళాబృందం ద్వారా ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను నియంత్రించి, ప్రతి పౌరుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో […]

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా, ఆద్యంతం ఆయన ప్రసంగం ఉద్వేగభరితం..

జగిత్యాల : ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ.. విధి లేని పరిస్థితిలో పార్టీని వీడుతున్నానని స్పష్టం చేసిన  జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి  ఎదగకుండా  అణగదొక్కాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన… ఆ పరిస్థితుల్లో పార్టీలో ఉండడం కంటే ఎదిరించి పోరాటం చేయడమే సరని నిర్ణయించుకున్నానని, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి  స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రం లోని […]

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం

హైదరాబాద్ : ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కంపెనీల నుండి 10-20 శాతం డిస్కౌంట్ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఈవి వాహనాలు వినియోగించండి.. ఈవీ పాలసీ ప్రభుత్వం రూపొందిస్తే ఈవి వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వ ఉద్యోగులే సెక్రటేరియట్ లో లాంఛనంగా ఉద్యోగులకు ఈవీ వాహనాల ప్రోత్సాహకాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణ రావు, డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ […]