మల్లాపూర్‌లో గిరిజన మినీ గురుకులం మోడల్ స్కూల్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల, మల్లాపూర్ మండలంలోని గిరిజన మినీ గురుకులం, టీజీ మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం సందర్శించి, విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధనా విధానం, విద్యార్థుల విద్యా ప్రగతి, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా పరిస్థితులు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, భోజనం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. […]



