# Tags
#Events #జగిత్యాల #తెలంగాణ

NHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు TNGOs, వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల సంఘీభావం

👁 5 Views

జగిత్యాల, అక్టోబర్ 16:

రాష్ట్ర NHM జేఏసీ పిలుపుమేరకు జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు జగిత్యాల జిల్లాలోని ఉద్యోగ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా TNGOs, TGEJAC జగిత్యాల జిల్లా చైర్మన్ ఎం. నాగేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి సమ్మె శిబిరాన్ని సందర్శించి NHM ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

అనంతరం NHM హెల్త్ సొసైటీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని TNGOs జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి కి ఉద్యోగుల తరఫున సమర్పించారు.

ఉద్యోగుల సమస్యలను సెంట్రల్ TGEJAC చైర్మన్ మారం జగదీశ్, కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు ఈసందర్బంగా హామీ ఇచ్చారు.

ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాల చెల్లింపు, వార్షిక ఇంక్రిమెంట్లు, ఆరోగ్య భద్రత, PRC బకాయిల విడుదల తదితర డిమాండ్లను తమ వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు ఏనుగంటి రాజేశం కోరారు.

ఈ కార్యక్రమంలో TGEJAC జిల్లా ట్రెజరర్ షాహిద్ బాబా, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం జిల్లా అధ్యక్షులు, టీఎన్జీవోస్ జిల్లా జాయింట్ సెక్రటరీ ఏనుగంటి రాజేశం, కార్యదర్శి కుతుబుద్దీన్, , తెలంగాణ మెడికల్ అండ్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఎంఓ సత్యనారాయణ, ఎ. శ్రీధర్, నరేందర్, శ్యాంసుందర్, మురళీధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.