# Tags
#Blog

ఈ విజయదశమి ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలి, జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

👁 1 Views

జగిత్యాల, అక్టోబర్ 19 విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. దృఢమైన సంకల్పం, పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పక సిద్ధిస్తుందనే స్ఫూర్తిని ఈ పండుగ అందిస్తుందని పేర్కొన్నారు.
దుర్గాదేవి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, చేపట్టిన ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సానుకూలత, విజయాలను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కోరినారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *